9 Hours: క్రిష్‌ ‘9అవర్స్‌’ ట్రైలర్‌ చూశారా..!

తారక రత్న ప్రధాన పాత్రలో  ప్రముఖ దర్శకుడు క్రిష్‌ అందించిన కథతో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌ ‘9 అవర్స్‌’. ఇందులో అజయ్‌, మధుశాలిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Published : 23 May 2022 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తారకరత్న ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ అందించిన కథతో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌ ‘9 అవర్స్‌’. అజయ్‌, మధుశాలిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌2వ తేదీ నుంచి డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఉత్కంఠభరితంగా ఉన్న ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ప్రేక్షకులను అలరిస్తుంది. ‘డెక్కన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌’లో 9గంటల పాటు ఏం జరిగిందన్న ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. నిరంజన్‌ కౌశిక్‌, జాకబ్‌ వర్గీస్‌లు దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌కు వై.రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని