సుశాంత్‌ కేసు: నివేదిక ఇచ్చిన ఎయిమ్స్‌ టీమ్‌

నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ మరణానికి దారితీసిన పరిస్థితులను..

Updated : 29 Sep 2020 14:38 IST

దిల్లీ: నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ మరణంపై దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి సమర్పించింది. సీబీఐ అభ్యర్థన మేరకు వైద్యుడు డా.సుధీర్‌ గుప్తా అధ్యక్షతన ఓ ఫోరెన్సిక్‌ వైద్య బృందం ఏర్పాటైంది. సుశాంత్‌ శరీర అంతర్భాగాల్లోనుంచి తీసిన నమూనాలకు సెప్టెంబర్‌ 7న సదరు ఫోరెన్సిక్‌ బృందం పరీక్షలు నిర్వహించింది. మరో ముగ్గురు సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని కూడా నటుడి ఇంటికి సీబీఐ తీసుకెళ్లి ఫోరెన్సిక్‌ సహా తదుపరి దర్యాప్తు కోసం పరీక్షలు నిర్వహించింది. సోమవారం అప్పగించిన సదరు నివేదికను సీబీఐ ప్రస్తుతం పరిశీలిస్తోంది.

జూన్‌ 14వ తేదీన సుశాంత్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రగ్స్‌ కోణంలోనూ ఈ కేసులో విచారణ జరుగుతోంది. నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, పలువురు సుశాంత్‌ సిబ్బంది అతడికి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తేలడంతో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) వారందరిని అరెస్టు చేసింది. పలువరు డ్రగ్‌ డీలర్లు సహా ఇప్పటికి 18 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాల కేసులోనే బాలీవుడ్‌ ప్రముఖ నటీమణులు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌లను కూడా ఎన్‌సీబీ ఇటీవల విచారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని