ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి కరీమా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు మాతృమూర్తి...

Published : 28 Dec 2020 14:40 IST

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి కరీమా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు మాతృమూర్తి మరణంతో రెహమాన్‌ విషాదంలో మునిగిపోయారు. కరీమా బేగం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. పలువురు ప్రముఖులు రెహమాన్‌కు సానుభూతి వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని