Aadavallu Meeku Johaarlu: కుటుంబంతో కలిసి రండి.. నవ్వుతూ బయటకు వెళ్లండి

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ

Updated : 04 Mar 2022 09:19 IST

ర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో  విలేకర్ల సమావేశం నిర్వహించారు. దర్శకుడు  తిరుమల కిషోర్‌ మాట్లాడుతూ ‘‘మహమ్మారి తర్వాత కుటుంబం.. పిల్లలతో కలిసి చూసే   సినిమాని మిస్సయ్యాం. ఆ లోటును మా చిత్రం పూడుస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమాతో థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో మంచి ప్రేమకథ ఉంది. దీంట్లోని ప్రతి సీన్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇంటర్వెల్‌ సీన్‌కు మహిళలు చప్పట్లు కొడతారని గట్టిగా చెప్పగలను’’ అన్నారు. ‘‘కుటుంబంతో సినిమాకు రండి. థియేటర్‌ నుంచి నవ్వుకుంటూ బయటకు వెళ్తార’’న్నారు నిర్మాత.  

అబ్బాయిలా పుట్టాలి..

‘‘వచ్చే జన్మలో తాను కచ్చితంగా అబ్బాయిలా పుట్టాలని కోరుకుంటున్నాన’’ని చెప్పింది నటి రష్మిక. గురువారం విలేకర్ల సమావేశంలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సరదాగా ఇలా బదులిచ్చింది. ‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం పూర్తయ్యాక.. నేనొకటి బలంగా కోరుకున్నా. వచ్చే జన్మంటూ ఉంటే నేను కచ్చితంగా అబ్బాయిలాగే పుట్టాలి (నవ్వుతూ). ఎందుకంటే ఆ చీరలు కట్టుకోవడం.. పాత్రకు తగ్గట్లుగా హెయిర్‌ స్టైల్‌, లుక్స్‌ మెయింటైన్‌ చేయడం.. చాలా కష్టం అనిపించింది. అదే అబ్బాయి అయితే డ్రెస్సింగ్‌ కోసం ఇంత కష్టపడాల్సిన అవసరముండదు కదా’’ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పెళ్లి విషయమై స్పందించిన ఆమె.. మంచి మనసున్న వ్యక్తి దొరికితే చాలని, అయితే పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని