Aadavallu Meeku Joharlu: నా బాధే వినరమ్మో

‘‘హే లక్ష్మమ్మో పద్మమ్మో.. శాంతమ్మో శారదమ్మో.. గౌరమ్మో కృష్ణమ్మో.. నా బాధే వినవమ్మో’’ అంటూ తన గోడు వినిపిస్తున్నాడు శర్వానంద్‌. మరి ఆయన కథేంటి? ఆడవాళ్ల వల్ల ఆయనకి కలిగిన బాధేంటి? అన్నది   తెలియాలంటే

Updated : 05 Feb 2022 06:58 IST

‘‘హే లక్ష్మమ్మో పద్మమ్మో.. శాంతమ్మో శారదమ్మో.. గౌరమ్మో కృష్ణమ్మో.. నా బాధే వినవమ్మో’’ అంటూ తన గోడు వినిపిస్తున్నాడు శర్వానంద్‌. మరి ఆయన కథేంటి? ఆడవాళ్ల వల్ల ఆయనకి కలిగిన బాధేంటి? అన్నది   తెలియాలంటే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చూడాల్సిందే. శర్వానంద్‌, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రమిది. తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టైటిల్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు..’’ అంటూ సాగే ఈ పాటలో.. హీరో తన వైఫల్యాలకు కారణమైన
ఆడవాళ్లందరిపై నిరాశను వ్యక్తం చేస్తూ కనిపించారు. తనకి పెళ్లి కాకపోవడానికి వాళ్లే కారణమని నిందించడం కనిపిస్తుంది. ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన శైలిలో ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ గీతంలో శర్వా వేసిన మాస్‌ స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే మహిళలకు ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని