ట్రైనర్‌తో ప్రేమలోపడిన స్టార్హీరో కుమార్తె..!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మిషాల్ అనే వ్యక్తితో కొంతకాలంపాటు రిలేషన్లో ఉన్న ఐరా.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్-ఐరాల మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ గతేడాది విడిపోయారు....
నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మిషాల్ అనే వ్యక్తితో కొంతకాలంపాటు రిలేషన్లో ఉన్న ఐరా.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్-ఐరాల మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఐరాఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ షీఖరేతో తాజాగా ప్రేమలోపడినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
గతకొన్నేళ్లుగా ఆమిర్‌కు ఫిట్నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నుపూర్ లాక్డౌన్ నుంచి ఐరాకు సైతం వర్కౌట్ల విషయంలో కోచ్‌గా మారారు. అయితే, నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఐరా అతనితో ప్రేమలోపడిందని.. కొన్నినెలలుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఐరా ఇప్పటికే ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల ఆమిర్‌ఖాన్ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం. వీరిద్దరికీ సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!