గాయమైనా పంటి బిగువున భరిస్తూ షూటింగ్‌!

వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ తన రూటే సపరేట్‌ అంటారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌

Published : 20 Oct 2020 12:40 IST

ముంబయి: వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ తన రూటే సపరేట్‌ అంటారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ‘ఆమీర్‌ఖాన్‌’. పాత్ర కోసం తనని తాను ఎంతలా మార్చుకోవడానికైనా, ఎంత బాధనైనా భరించడానికి ఆయన సిద్ధపడతారు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. కరీనా కపూర్‌ఖాన్‌, విజయ్‌ సేతుపతి, మోనా సింగ్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల మొదలైంది. తాజా షెడ్యూల్‌లో కరీనా నటించే సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఓ యాక్షన్‌ సన్నివేశంలో పాల్గొన్న ఆమీర్‌ఖాన్‌ గాయపడ్డారట. పక్కటెముకల్లో బలమైన దెబ్బ తగిలిందట. అయినా, ఆ బాధను పంటి బిగువున భరిస్తూ, పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని మరీ షూటింగ్‌లో పాల్గొన్నారు‌. ఇప్పటికే షూటింగ్‌ అనేక అవాంతరాలు ఎదుర్కోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని భావించిన ఆమీర్‌ ఆ బాధతోనే చిత్రీకరణలో పాల్గొంటున్నారు.  మరోవైపు కరోనా నేపథ్యంలో చిత్ర బృందం కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని