మరింత థ్రిల్లింగ్‌గా ఆ వెబ్‌ సిరీస్‌కు కొనసాగింపు!

బాలీవుడ్‌ నటుడు బాబీ దేఓల్‌ కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆశ్రమ్‌’. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి ఆదరణ

Published : 22 Oct 2020 19:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు బాబీ దేఓల్‌ కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆశ్రమ్‌’. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. కాగా, త్వరలోనే దీనికి కొనసాగింపుగా ‘ఆశ్రమ్‌2’ కూడా రాబోతోంది. ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ నవంబరు 11 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.ఈ నేపథ్యంలో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

అన్ని రంగాలను శాసించే బాబా నిరాలా ఆఫ్‌ కాశీపూర్‌ పాత్రలో బాబీ దేఓల్‌ నటించారు. తొలిసారి ఆయన ఈ వెబ్‌సిరీస్‌లో నటిస్తుండటం విశేషం. దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏవిధంగా కొలిచేవారు. ఆయనను ఏవిధంగా అనుసరించేవారు. ఆ ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు? చివరకు బాబా ఏమయ్యారు? ఆయనలోకి క్రూరత్వం ఎలా బయటపడింది? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్రమ్2‌’ చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని