షాకింగ్‌ గెటప్‌లో అభిషేక్‌ బచ్చన్‌!

Updated : 27 Nov 2020 09:21 IST

దిల్లీ: అభిషేక్‌ బచ్చన్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న తాజా చిత్రం ‘బాబ్‌ బిశ్వాస్‌’ కోల్‌కతాలో చిత్రీకరణ జరుగుతోంది. కాగా దీనిలో ‘స్మాల్‌ బీ’ అభిషేక్‌ గెటప్‌ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. వెడల్పైన పెద్ద కళ్లజోడు, పాపిడి తీసిన హెయిర్‌ స్టైల్‌తో మధ్య వయసు వ్యక్తిలాగా ఆయన ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇంతకీ దీనికి ప్రేరణ ఏదంటే...

 

ప్రముఖ దర్శకుడు సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ బాలీవుడ్‌ చిత్రం ‘కహానీ’. దీనిలో హీరోయిన్‌ విద్యా బాలన్‌కు ఎంత పేరు వచ్చిందో.. ‘బాబ్‌ బిశ్వాస్‌’ పాత్రకు కూడా అంతే పాపులారిటీ వచ్చింది. బయటకు బీమా ఏజెంటుగా కనిపించే.. కరడు గట్టిన కిరాయి హంతకుడి పాత్రను శాశ్వతా ఛటర్జీ అనే నటుడు పోషించారు. కాగా, ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌ బాబ్‌ బిశ్వాస్‌ చిత్రంలో ఆ గెటప్‌లో కనిపించనున్నారు. ఈయన సరసన చిత్రాంగదా సింగ్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, తన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. దీనికి సుజోయ్‌ ఘోష్‌ కుమార్తె దియా అన్నపూర్ణ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరిలో తొలి షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొవిడ్‌ కారణంగా వాయిదాపడింది. ఇక జూనియర్‌ బచ్చన్‌ జులైలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన కోలుకున్న అనంతరం సినిమా చిత్రీకరణ తిరిగి పట్టాలకెక్కింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని