‘బిగ్‌బుల్‌’ కోసం అభిషేక్‌ బచ్చన్‌

అభిషేక్‌ బచ్చన్‌, ఇలియానా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బిగ్‌బుల్‌’. అజయ్‌ దేవగణ్‌, ఆనంద్‌ పండిత్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా

Published : 20 Sep 2020 20:42 IST

ముంబయి: అభిషేక్‌ బచ్చన్‌, ఇలియానా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బిగ్‌బుల్‌’. అజయ్‌ దేవగణ్‌, ఆనంద్‌ పండిత్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు ఆటంకం ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం షూటింగ్‌లకు షరతులతో కూడిన అనుమతులు  ఇచ్చింది. దీంతోఆరునెలల విరామం అనంతరం అభిషేక్‌ బచ్చన్‌ తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

‘‘నేను ‘బిగ్‌బుల్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్నా. కొన్ని రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. మీరందరూ  భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. కరోనా దరి చేరకుండా మీరు ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తలు పాటించండి. ఎల్లప్పుడూ మాస్క్‌ను ధరించండి’’ అని అన్నారు. గతంలో ఈ చిత్రాన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల చేస్తామని జూనియర్‌ బచ్చన్‌ ప్రకటించారు. స్టాక్‌ మార్కెట్‌లో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హర్షద్‌ మోహతా జీవితం ఆధారంగా సినిమా నిర్మితమవుతున్నట్లు బాలీవుడ్ టాక్‌. జులై 11న అభిషేక్‌ బచ్చన్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అనంతరం చికిత్స తీసుకుని కోలుకున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని