‘ద్రోణ’ ఫ్లాప్‌.. సినిమాల నుంచి తొలగించారు..!

అమితాబ్‌ బచ్చన్‌ కుమారుడిగా వెండితెరకు పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు అభిషేక్‌ బచ్చన్‌. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నటుడిగా ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అభిషేక్‌ హీరోగా నటించిన ‘ద్రోణ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే....

Published : 02 Oct 2020 00:48 IST

అవకాశాలు రాలేదు: అభిషేక్‌ బచ్చన్‌

ముంబయి: అమితాబ్‌ బచ్చన్‌ కుమారుడిగా వెండితెరకు పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు అభిషేక్‌ బచ్చన్‌. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నటుడిగా ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అభిషేక్‌ హీరోగా నటించిన ‘ద్రోణ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అభిషేక్‌ ఆ సినిమా నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు. ‘ద్రోణ’ తర్వాత తనని కొన్ని సినిమాల్లో నుంచి తొలగించారని చెప్పారు.

తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ నెటిజన్‌.. ‘‘ద్రోణ’ తర్వాత మీరు వేరే చిత్రాల్లో అవకాశం ఎలా పొందారు?’ అని అభిషేక్‌ని ప్రశ్నించగా.. ‘‘ద్రోణ’ తర్వాత నాకు ఆఫర్స్‌ రాలేదు. ఆ సమయంలో కొన్ని సినిమాల నుంచి నన్ను తొలగించారు. అవకాశాలు పొందడం కూడా కష్టంగా మారింది. కలలను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు అడుగులు వేయాలి. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఈ భూమ్మీద నీకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకోవడం కోసం నువ్వు పోరాడాల్సిందే. జీవితంలో ఏదీ అంత సులువుగా దొరకదు’ అని అభిషేక్‌ సమాధానమిచ్చారు. ఆయన ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సర్‌.. మీరు గ్రేట్‌’ అని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు.

అభిషేక్‌బచ్చన్‌, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ద్రోణ’ చిత్రం 2008లో విడుదలయ్యింది. జయాబచ్చన్‌ ఓ కీలకపాత్ర పోషించారు. సునీల్‌ లుల్లా, అమితాబ్‌ బచ్చన్‌ నిర్మాతలుగా దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. రూ.15 కోట్ల కంటే తక్కువ వసూళ్లను ఈ చిత్రం రాబట్టిందని అప్పట్లో సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం అభిషేక్‌ ‘ది బిగ్‌బుల్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని