అక్రమమైతే ఎలా అమ్ముతున్నారు?

టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా చెప్పిన పలు విషయాలతోపాటు, ఆమె వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీమణులకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌, నటి శ్రద్ధాకపూర్‌తోపాటు పలువురు సెలబ్రిటీలకు తాను సీబీడీ ఆయిల్‌ సరఫరా చేశానని....

Updated : 24 Sep 2020 16:10 IST

అధికారులను ప్రశ్నించిన నటి మీరా చోప్రా

ముంబయి: టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా చెప్పిన పలు విషయాలతోపాటు, ఆమె వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీమణులకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌, నటి శ్రద్ధాకపూర్‌తోపాటు పలువురు సెలబ్రిటీలకు తాను సీబీడీ ఆయిల్‌ సరఫరా చేశానని జయాసాహా ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్లు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో సీబీడీ ఆయిల్‌ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటి మీరా చోప్రా.. ఆన్‌లైన్‌ వేదికగా సీబీడీ ఆయిల్‌ క్రయవిక్రయాలు జరుగుతున్నాయని.. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ మార్ట్‌లో తాను చూశానని అన్నారు. ‘సీబీడీ ఆయిల్‌ కొనుగోలు, అమ్మకం అక్రమం అయితే.. ఆన్‌లైన్‌లో యథేచ్ఛగా క్రయవిక్రయాలు ఎలా జరుగుతున్నాయి. ఓ పేరుపొందిన ఆన్‌లైన్‌ మార్కెట్‌లో సీబీడీ ఆయిల్‌ అమ్మకాలు జరగడం నేను చూశాను. అక్రమంగా అమ్మకాలు జరుపుతోన్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు.?’ అని మీరా చోప్రా ప్రశ్నించారు.

మరోవైపు బాలీవుడ్‌ తొలిసారిగా తన క్రూరత్వం గురించి చింతిస్తోందని నటి కంగనా రనౌత్‌ అన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ వంటి వారి పట్ల తప్పుగా ప్రవర్తించినందుకు పరిశ్రమ ఇప్పుడు పశ్చాత్తాపపడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కంగన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘‘ఇన్నాళ్లకు మొదటి సారిగా ‘బుల్లీవుడ్’ మాఫియా సుశాంత్‌ సింగ్‌ చనిపోయి ఉండకూడదని, కంగనను తాము ఇరుకున పెట్టకుండా ఉండాల్సిందని కోరుకుంటోంది. తన క్రూరత్వానికి పశ్చాత్తాపపడుతోంది. ఒక్కసారి కాలంలో వెనక్కి వెళ్లి, మమ్మల్ని తిరిగి తెచ్చుకోవాలని కోరుకుంటోంది.’’ అని కంగన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని