ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రాజశేఖర్‌

సినీ నటుడు రాజశేఖర్‌ కరోనాను జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సినీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ నుంచి ఆయనను వైద్యులు

Updated : 10 Nov 2020 11:06 IST

హైదరాబాద్‌: సినీ నటుడు రాజశేఖర్‌ కరోనాను జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. తన సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్‌ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

గత కొన్ని రోజుల కిందట రాజశేఖర్‌ కరోనా బారిన పడగా, చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. వెంటిలేటర్‌పై ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటినీ ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్‌ మీద చికిత్స అందించలేదని, ఆ వార్తలు అవాస్తవమని జీవిత పేర్కొన్నారు. ఐసీయూలోనే ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేశారని వివరించారు. అనంతరం ప్లాస్మా థెరపీ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాజాగా రాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగు పడటంతో డిశ్చార్జి చేశారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని