ఎస్పీబీని తలుచుకుని తనికెళ్ల భరణి భావోద్వేగం

‘‘చాలా గొప్ప సినిమా చేశావు భరణి. ఎప్పుడైనా నా జీవిత చరిత్ర రాయాలంటే ‘మిథునం’కు ముందు, తర్వాత’’ అంటూ

Updated : 29 Dec 2020 16:40 IST

హైదరాబాద్‌: ‘‘చాలా గొప్ప సినిమా చేశావు భరణి. ఎప్పుడైనా నా జీవిత చరిత్ర రాయాలంటే ‘మిథునం’కు ముందు, తర్వాత’’ అంటూ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనని మెచ్చుకున్నారని నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను భరణి పంచుకున్నారు.

దర్శకుడు వంశీ సినిమాకు సన్నివేశాలు రాస్తుంటే కన్నీళ్లు వచ్చేవని, ఇంకు పెన్నుతో రాసిన అక్షరాలు చెరిగిపోతుండటంతో బాల్‌ పెన్ను వాడానని సరదాగా చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు తనని అందరూ ‘భరణి దాదా’ అని ఎందుకు పిలిచేవారో కూడా ఈ సందర్భంగా నవ్వుతూ పంచుకున్నారు. నవరసాలు నిండిన ఈ ఎపిసోడ్‌ చూడాలంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాల్సిందే. జనవరి 4వ తేదీన ఇది ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ సరదా ప్రోమోను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని