25 ఏళ్ల తర్వాత వస్తున్న నటి ఎవరు?

మాటల్లోని చలాకీతనం, చూపుల్లోని అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఓ నటి దాదాపు పాతికేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈటీవీ వేదికగా ప్రతి సోమవారం రాత్రి ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఆమె విచ్చేస్తున్నారు....

Published : 12 Nov 2020 15:00 IST

ఆకట్టుకుంటున్న వీడియో

హైదరాబాద్‌: మాటల్లోని చలాకీతనం, చూపుల్లోని అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఓ నటి దాదాపు పాతికేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈటీవీ వేదికగా ప్రతి సోమవారం రాత్రి ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఆమె విచ్చేస్తున్నారు.

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ స్పెషల్‌ ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ‘25 సంవత్సరాల తర్వాత మీ ముందుకు వస్తున్న ఆ నటి ఎవరు?’ అంటూ ఆమెని చూచాయగా చూపించారు. సదరు వీడియో చూసిన ప్రేక్షకులు.. ఆమె ఎవరై ఉంటారా? అని ఆలోచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఆ నటి ఎవరు? ఆమె చెప్పిన విశేషాలు తెలుసుకోవాలంటే ‘ఆలీతో సరదాగా’ 202వ ఎపిసోడ్‌ ప్రోమో వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని