మహేశ్‌భట్‌ నన్ను వేధించాడు: నటి

బాలీవుడ్‌లో పేరుపొందిన నిర్మాత మహేశ్‌భట్‌ తనని వేధింపులకు గురి చేశాడంటూ నటి లువియానా లోధ్ ఆరోపణలు చేశారు. ఆయన నుంచి తనకి ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. మహేశ్‌భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ను వివాహం చేసుకున్న లువియానా ఇటీవల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

Updated : 24 Oct 2020 22:06 IST

ఇండస్ట్రీకి ఆయన పెద్ద డాన్‌

ముంబయి‌: బాలీవుడ్‌లో పేరుపొందిన నిర్మాత మహేశ్‌భట్‌ తనని వేధింపులకు గురి చేశాడంటూ నటి లువియానా లోధ్ ఆరోపణలు చేశారు. ఆయన నుంచి తనకి ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. మహేశ్‌భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ను వివాహం చేసుకున్న లువియానా ఇటీవల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే మహేశ్‌భట్‌పై పలు ఆరోపణలు చేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

దాదాపు 2 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో ఆమె మహేశ్‌భట్‌ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ‘మహేశ్‌భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ను కొంతకాలం క్రితం నేను వివాహం చేసుకున్నాను. పలువురు హీరోయిన్లకు సుమిత్‌ మాదకద్రవ్యాలు సరఫరా చేస్తాడనే విషయం తెలియడంతో ఇటీవల విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాను. ఈ విషయాలన్నీ మహేశ్‌భట్‌కి తెలుసు. సినీ పరిశ్రమకు ఆయన‌ ఓ పెద్ద డాన్‌. పరిశ్రమకు చెందిన ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పినట్లు వినకపోతే.. ఎదుటివారి జీవితాలను కష్టాల్లోపడేస్తాడు. ఆయన మాట విననందుకు పని లేకుండా చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు. ఆయన ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు ఉద్యోగాలు కోల్పోతారు. మా ఇంటి నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టాలని చూశాడని పేర్కొంటూ ఆయనపై గతంలో వేధింపుల కేసు నమోదు చేశాను. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. నాతోపాటు నా కుటుంబ భద్రత కోసమే ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నాను. ఒకవేళ నాకు, నా కుటుంబానికి ఏదైనా జరగరానిది జరిగితే దానికి కారణం మహేశ్‌భట్‌, ముఖేష్‌భట్‌, సుమిత్‌ సబర్వాల్‌, సాహెల్‌ సెహగల్‌, కుంకుమ్‌ సెహగల్‌’ అని నటి లువియానా లోధ్ ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు