శీతాకాలంలో ఇలా స్నానం చేస్తే..!

మరికొన్ని రోజుల్లో శీతాకాలం రాబోతోంది. ఉష్ణోగ్రతలో మార్పు వల్ల శరీరం పొడిబారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. కొందరిలో ఈ సమస్య మరీ ఎక్కువైపోవడంతో చర్మ వైద్యుల్ని కూడా సంప్రదిస్తుంటారు. అయితే అటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి బాలీవుడ్‌ .....

Published : 20 Oct 2020 00:43 IST

జుట్టు రాలకుండా ఉండాలంటే?

రవీనా సౌందర్య చిట్కాలు

ముంబయి: మరికొన్ని రోజుల్లో శీతాకాలం రాబోతోంది. ఉష్ణోగ్రతలో మార్పు వల్ల శరీరం పొడి బారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. కొందరిలో ఈ సమస్య మరీ ఎక్కువై పోవడంతో చర్మ వైద్యుల్ని కూడా సంప్రదిస్తుంటారు. అయితే అటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి బాలీవుడ్‌ కథానాయిక రవీనా టాండన్‌ సౌందర్య చిట్కాలు చెప్పారు. ‘బ్యూటీ టాకీస్‌ విత్‌ రావ్జ్‌’ సిరీస్‌లో భాగంగా శీతాకాలంలో ఎలా స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుందో వివరించారు.

* మీరు స్నానానికి ఉపయోగించే సబ్బు ఆర్గానికై (రసాయనాలు లేకుండా సహజమైన పదార్థాలతో కూడినది) ఉండాలి. అది మీ చర్మానికి హాని కలిగించేలా ఉండకూడదు.

* స్నానం పూర్తయిన తర్వాత వస్త్రం తీసుకుని చర్మాన్ని మృదువుగా తుడవండి. అలా చేస్తే చర్మం పాడైపోతుంది.

* ఆపై శరీరాన్ని మాయిశ్చరైజ్‌ చేయాలి. దీని కోసం స్వచ్ఛమైన పాలు ఉపయోగిస్తే మంచి ఫలితం లభిస్తుంది. నేను కూడా పాలు వాడతాను. మొదట మృదువైన వస్త్రాన్ని తీసుకుని పాలలో ముంచండి. దాన్ని మీ చర్మంపై మెల్లగా అద్దండి. తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వండి.. అంటూ రవీనా వీడియోలో చెప్పారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే?

కొన్ని రోజుల క్రితం రవీనా దృఢమైన జుట్టు కోసం ఏం చేయాలో సూచించారు. జుట్టు రాలకుండా ఉండాలంటే పురాతన కాలంలో ఇలా చేసేవారంటూ ఆ పద్ధతిని వివరించారు. ‘ఆరు ఉసిరి కాయలు, కప్పు పాలు తీసుకుని బాగా మరిగించాలి. ఉసిరి మెత్తగా అయిన తర్వాత గింజలు తీసేసి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని