నాకు బ్రేకప్‌ చెప్పి ఆదిత్యను ప్రేమించింది

కాలేజీలో చదువుతున్న రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయిని ఆదిత్యా రాయ్‌ కపూర్‌ తనవైపుకు తిప్పుకున్నాడని బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. 2017లో నేహా ధుపియా రేడియో చాట్‌ షో సీజన్‌ 2లో ఆయన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జూనియర్‌ కాలేజీలో అమ్మాయిలు అతడ్ని....

Updated : 28 Oct 2020 13:56 IST

కాలేజీ రోజుల్లో.. ఆదిత్య రియాక్షన్‌ ఇది..!

ముంబయి: కాలేజీలో చదువుతున్న రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయిని ఆదిత్యా రాయ్‌ కపూర్‌ తనవైపుకు తిప్పుకున్నాడని బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. 2017లో నేహా ధుపియా రేడియో చాట్‌ షో సీజన్‌ 2లో ఆయన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జూనియర్‌ కాలేజీలో అమ్మాయిలు అతడ్ని (ఆదిత్య) తెగ ఇష్టపడేవారు. నేను అప్పట్లో ఓ అమ్మాయిని చాలా ప్రేమించా. ఇప్పుడు తనకు పెళ్లైపోయింది, ఒక పిల్లాడు కూడా పుట్టాడు. మేమిద్దరం జీవితం గురించి ఎన్నో కలలు కన్నాం. అలా మా ప్రేమ ఐదేళ్లు సంతోషంగా సాగింది. నేను ఆమె ప్రేమలో పిచ్చిగా మునిగిపోయా. చివరికి నాకు బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయింది. ఆపై ఆద్యితా రాయ్‌ కపూర్‌కు దగ్గరైంది’ అని చెప్పారు.

కాగా దాదాపు మూడేళ్ల తర్వాత రణ్‌వీర్‌ వ్యాఖ్యలపై ఆదిత్య స్పందించారు. రణ్‌వీర్‌ ఎక్కువగా ఊహించుకుని.. మాట్లాడారన్నారు. ఆ అమ్మాయి ఆయనతో విడిపోయిన కొన్ని నెలల తర్వాత తనను కలిసిందని తెలిపారు. ‘రణ్‌వీర్‌ ఎలా ఫీల్‌ అయ్యాడో, ఏం అనుకున్నాడో నాకు తెలియదు. కానీ వాళ్లిద్దరు విడిపోయిన ఎనిమిది నెలల తర్వాత ఆ అమ్మాయిని నేను చూశా’ అని వివరించారు.
రణ్‌వీర్‌, దీపికా పదుకొణె 2018 నవంబరు 14న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌-లీలా’ సినిమా షూటింగ్‌లో వీరు ప్రేమలోపడ్డారు. కొన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం రణ్‌వీర్‌ తన తర్వాతి సినిమా ‘83’లో నటిస్తున్నారు. ఆదిత్య కథానాయకుడి పాత్ర పోషించిన ‘సడక్‌ 2’ ఇటీవల ఓటీటీలో విడుదలైంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని