Ajith: అజిత్‌ మరోసారి

తమిళ కథానాయకుడు అజిత్‌... కొద్దిమంది దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. మొన్నటిదాకా దర్శకుడు శివతో కలిసి ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’... ఇలా వరుసగా సినిమాలు చేశారు. ఇప్పుడు

Updated : 09 Feb 2022 07:03 IST

తమిళ కథానాయకుడు అజిత్‌... కొద్దిమంది దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. మొన్నటిదాకా దర్శకుడు శివతో కలిసి ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’... ఇలా వరుసగా సినిమాలు చేశారు. ఇప్పుడు హెచ్‌.వినోద్‌తో అలాంటి ప్రయాణమే చేస్తున్నారు. ‘నెర్కొండ పార్వై’తో విజయాన్ని అందుకున్న ఈ జోడీ, ఆ వెంటనే ‘వలిమై’ కోసం జట్టు కట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు. బోనీకపూర్‌ నిర్మించనున్న ఆ సినిమా హైదరాబాద్‌లోనే ఆరంభం కానుంది. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ నటుడు మోహన్‌లాల్‌తోపాటు, తెలుగు కథానాయకుడు నాగార్జున పేర్లని పరిశీలించారు. ఎవరు ఖరారవుతారో తెలియదు కానీ.. ఈ సినిమా మరో ఆసక్తికరమైన కథతో రూపొందుతున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని