Romantic: ఒక వారం ముందే!

ఆకాష్‌ పూరి కథానాయకుడిగా తెరకెక్కిన ‘రొమాంటిక్‌’ అక్టోబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదట ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా నిర్ణయం మారింది. దాంతో వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 19 Oct 2021 06:51 IST

కాష్‌ పూరి కథానాయకుడిగా తెరకెక్కిన ‘రొమాంటిక్‌’ అక్టోబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదట ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా నిర్ణయం మారింది. దాంతో వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్‌  నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే కథ, మాటలు, స్క్రీన్‌ప్లేని సమకూర్చారు. అనిల్‌ పాదూరి దర్శకుడు. ఆకాష్‌కి జోడీగా కేతికాశర్మ నటించింది. ‘‘ఇప్పటివరకు మూడు పాటల్ని విడుదల చేశాం. చక్కటి స్పందన లభించింది. చిత్రం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. రమ్యకృష్ణ,  మకరంద్‌ దేశ్‌పాండే, ఉత్తేజ్‌ తదితరులు నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని