Selfie: ‘సెల్ఫీ’ షురూ!

అక్షయ్‌కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సెల్ఫీ’. మలయాళ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు రీమేగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గుడ్‌న్యూస్‌’

Updated : 11 Mar 2022 13:09 IST

క్షయ్‌కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సెల్ఫీ’. మలయాళ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు రీమేగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గుడ్‌న్యూస్‌’ చిత్రంతో మంచి విజయం అందుకున్న రాజ్‌ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం నుంచి చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ నేపథ్యంలో ఓ హీరో, ఓ మోటార్‌ సైకిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మధ్య జరిగే కథతో ఈ చిత్రం సాగుతుంది. మలయాళంలో పృథ్విరాజ్‌ సుకుమారన్‌, సూరజ్‌ వెంజారామూడు ప్రధాన పాత్రల్లో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని