విజయ్‌ నిర్మాతకు బన్నీ అభినందన..!

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో నిర్మాతగా తొలి అడుగులు వేస్తోన్న తన స్నేహితుడు కేదార్‌ సెలగంశెట్టిని అల్లు అర్జున్‌ అభినందించారు. ఈ మేరకు కేదార్‌ని శుక్రవారం ఉదయం తన నివాసానికి ఆహ్వానించారు...

Published : 03 Oct 2020 01:12 IST

స్టైలిష్‌స్టార్‌ మెచ్చిన చిత్రమిది

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో నిర్మాతగా తొలి అడుగులు వేస్తోన్న తన స్నేహితుడు కేదార్‌ సెలగంశెట్టిని అల్లు అర్జున్‌ అభినందించారు. ఈ మేరకు కేదార్‌ని శుక్రవారం ఉదయం తన నివాసానికి ఆహ్వానించారు. నిర్మాతగా కేదార్‌ ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనకి ఓ మొక్కను బహుమతిగా అందించారు. బన్నీ నుంచి శుభాకాంక్షలు పొందడం తనకెంతో సంతోషంగా ఉందని కేదార్‌ తెలిపారు.

కాగా, ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘పలాస 1978’ చిత్రం తనకెంతగానో నచ్చిందని బన్నీ తెలిపారు. ఈ మేరకు సదరు చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ని ప్రశంసించారు. శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోని బన్నీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘తాజాగా నేను ‘పలాస 1978’ చిత్రాన్ని వీక్షించాను. ఈ సినిమా నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ని కలిసి అభినందించాను. గొప్ప సందేశంతో మంచి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్నో మంచి విషయాలున్నాయి. టాలెంట్‌ ఉన్న నూతన దర్శకులు, నటీనటులు తెలుగు పరిశ్రమలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని బన్నీ పేర్కొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని