అంతా దగ్గరే ఉన్నా..ఇంకా దూరమే: అమితాబ్‌

కరోనా నుంచి కోలుకోని ఇంటికి చేరుకున్న బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు హోం క్వారంటైన్‌ సరిపడటం లేదు.

Updated : 13 Jul 2021 20:05 IST

ముంబయి: కరోనా నుంచి కోలుకోని ఇంటికి చేరుకున్న బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు హోం క్వారంటైన్‌ సరిపడటం లేదు. ఈ వయసులో కూడా చురుగ్గా ఉండే ఆయనకు ఒక దగ్గరే పరిమితమై, ఏకాంతంలో ఉండటం.. జైల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందట. ఈ క్వారంటైన్‌ లైఫ్ అనుభవాలను తాజాగా బ్లాగ్‌లో పంచుకున్నారు. ‘సొంత ఇంటిలో ఏకాంతం.. ఇంట్లో వారిని కలుసుకోలేకపోవడం.. జైల్లో వారిని పలకరించినట్లు పత్ర్యేక సమయాలు.. తరచూ సినిమాలు చూడటం.. అడ్డుగా గ్లాస్‌ తెర.. ఫోన్‌ సంభాషణలు, చేతుల సైగలతోనే అంతా జరుగుతోంది. కొన్ని అంగుళాల దూరంలోనే కుటుంబం ఉన్నా..ఇంకా దూరమే’ అంటూ బ్లాగ్‌లో కవితాత్మకంగా ఆయన పరిస్థితిని చెప్పుకొచ్చారు. అలాగే రక్షాబంధన్‌ సందర్భంగా రాఖీలు అందాయని, దానికి సంబంధించిన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని