రోజులో 14 గంటలు పనిచేస్తున్నా: అమితాబ్‌

77 ఏళ్ల వయసులోనూ చురుకుగా షూటింగ్‌లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఆయన రోజులో 14 గంటలు పనిచేస్తున్నారట. తను వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోను ఉద్దేశిస్తూ ఆయన బ్లాగ్‌లో కవిత రాశారు. ఈ షో బృందంతో కలిసి....

Published : 17 Sep 2020 01:31 IST

ముంబయి: 77 ఏళ్ల వయసులోనూ షూటింగ్‌లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఆయన రోజులో 14 గంటలు పనిచేస్తున్నారట. తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోను ఉద్దేశిస్తూ ఆయన బ్లాగ్‌లో కవిత రాశారు. ఈ షో బృందంతో కలిసి పనిచేయడం మధురమైన అనుభవమని పేర్కొన్నారు. ‘అవును.. నేను విభిన్న రకాల పనులు చేస్తున్నా. కొన్ని పనుల్ని సరదాగా ఆస్వాదిస్తున్నా. కొన్ని సార్లు రాత్రింబవళ్లు కష్టపడుతుంటా. ప్రజలు కేబీసీని విశేషంగా ఆదరిస్తున్నారు. వారి అంచనాల్ని అందుకోవాలని ఛానల్‌ ప్రతినిధులు ఆశిస్తున్నారు. ఈ మధ్యే షో షూట్‌ను ఆరంభించా. ఇంకా చేయాల్సిన ఎపిసోడ్‌లు ఎన్నో ఉన్నాయి. మీ అందరి ప్రేమ, గౌరవం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా’

‘తెల్లవారుజామునే షూట్‌కు వెళ్తున్నా. ప్రపంచంలో పోటీ బాగా పెరిగిపోయింది. నేను రోజులో 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నా. బృందం కూడా ఎంతో సపోర్ట్‌ చేస్తోంది. మనిషి అనుకుంటో సాధించలేనిది ఏదీ లేదు. ‘సాధ్యం కానిది లేదు’ అనే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ప్రతి నిమిషం, ప్రతి గంటలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

అమితాబ్‌ ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయి ఆసుపత్రిలో చేరారు. ఆయనతోపాటు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, ఆరాద్యకు కూడా కరోనా సోకింది. వీరంతా కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. దీని తర్వాత బిగ్‌బి షూటింగ్‌కు హాజరౌతున్నారు. అమితాబ్‌ నటించిన ‘గులాబో సితాబో’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ‘చెహ్రే’, ‘బ్రహ్మాస్త్ర’ తదితర చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని