ఆ రాతలు నన్నెంతో బాధించాయి: యాంకర్‌ ప్రదీప్‌

సామాజిక మాధ్యమాల్లో, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో గత రెండు మూడు రోజులుగా తనపై వస్తోన్న ఆరోపణలపై యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు స్పందించారు. ఆ రాతలు తననెంతగానో బాధించాయన్నారు..............

Published : 28 Aug 2020 01:10 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాలు, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో గత రెండు మూడు రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు స్పందించారు. ఆ రాతలు తననెంతగానో బాధించాయన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన ఫొటోలు పెట్టి వార్తలు రాయడం దారుణమన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో అసలు తనపేరు ఎందుకు ఉందో? అవతలి వ్యక్తులు ఏ ఉద్దేశంతో తనపేరు చెప్పారో? ఎవరు చెప్పించారో?.. ఇలా ఏదీ ఆలోచించకుండా వేధించడం సరికాదని పేర్కొంటూ ‘ద ట్రూత్‌’ అనే పేరుతో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఒక వ్యక్తికి న్యాయం జరగడం కోసం నిజానిజాలు తెలుసుకోకుండానే ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారా? ఇలాంటివి రాస్తే నిజం తెలిసేలోపు తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.

తనపై వస్తున్న ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవంలేదని ప్రదీప్‌ అన్నారు. ఈ వ్యవహారంలో ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు వెళ్తానన్నారు. ప్రజలకు వినోదం పంచడం తప్ప తనకేమీ తెలియదన్నారు. తనకు తోచినంత వరకు కుదిరితే సాయం చేశానే తప్ప.. ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని