రజనీ ఆరోగ్యంపై మరో హెల్త్‌ బులెటిన్‌

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. రక్తపోటులో హెచ్చు తగ్గుల

Published : 26 Dec 2020 18:31 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. రక్తపోటులో హెచ్చు తగ్గుల కారణంగా చికిత్స నిమిత్తం రజనీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం అపోలో ఆస్పత్రి వర్గాలు ఆయన ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి.

‘‘రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. కొన్ని వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. ఇప్పటివరకూ చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళన లేదు. వైద్య పరీక్షల నివేదికలు చూసి రేపు రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం’’ -అపోలో ఆస్పత్రి వర్గాలు

తమిళ సినిమా ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌కు రజనీ వచ్చారు. నిత్యం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నెలాఖరుకల్లా షెడ్యూల్‌ ముగియనుంది. ఇటీవల సెట్‌లో నలుగురికి కొవిడ్‌ రావడంతో దర్శకుడు శివ షూటింగ్‌ నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఈనెల 22న రజనీకాంత్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంతలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అనారోగ్యం తలెత్తడంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని