Ante Sundaraniki: సుందరం... సందడి ఎప్పుడంటే!

‘‘సుందరం జాతకం ప్రకారం బర్త్‌డే హోమం జరిగిన 108 రోజుల వరకు బయటికి  రాకూడదన్నారు. అందుకే జూన్‌ 10న నవ్వించ డానికి   థియేటర్‌కి వస్తున్నాడ’’ని తెలిపింది ‘అంటే... సుందరానికీ!’ చిత్రబృందం. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నజ్రియా

Updated : 24 Feb 2022 08:56 IST


‘‘సుందరం జాతకం ప్రకారం బర్త్‌డే హోమం జరిగిన 108 రోజుల వరకు బయటికి  రాకూడదన్నారు. అందుకే జూన్‌ 10న నవ్వించ డానికి   థియేటర్‌కి వస్తున్నాడ’’ని తెలిపింది ‘అంటే... సుందరానికీ!’ చిత్రబృందం. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నజ్రియా కథానాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు.గురువారం నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బర్త్‌డే హోమం మొదలైంది’ అంటూ టీజర్‌ని విడుదల చేశారు. అందులో సినిమా విడుదల తేదీనీ ప్రకటించింది చిత్రబృందం.‘‘బయటికెళితే ద్విచక్రవాహన గండం, నీళ్లలోకెళితే జలగండం, నడిస్తే రోడ్డు గండం, కూర్చుంటే కుర్చీ గండం...’’ అంటూ నాని చేసిన సందడి టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది. నాని వినోదాత్మక పాత్రలో సందడి చేస్తారని టీజర్‌నిబట్టి స్పష్టమవుతోంది. నదియా, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా నాయుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని