Butterfly: థ్రిల్లర్‌ ‘బటర్‌ఫ్లై’

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్‌ చిత్రం ‘బటర్‌ఫ్లై’. గంటా సతీష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. రవి ప్రకాష్‌ బోడపాటి, ప్రసాద్‌ తిరువళ్లూరి, ప్రదీప్‌ నల్లిమెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను

Updated : 04 Mar 2022 09:20 IST

నుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్‌ చిత్రం ‘బటర్‌ఫ్లై’. గంటా సతీష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. రవి ప్రకాష్‌ బోడపాటి, ప్రసాద్‌ తిరువళ్లూరి, ప్రదీప్‌ నల్లిమెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. అనుపమ సంతోషంగా తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లడం.. లిఫ్ట్‌ ఎక్కే క్రమంలో కొన్ని అనూహ్య దృశ్యాలు ఆమె కంటపడటం.. అక్కడి నుంచి ఆమె జీవితం సమస్యల్లో చిక్కుకోవడం.. లాంటి సన్నివేశాలతో టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరి ఆమెకు కనిపించిన ఆ అనూహ్య దృశ్యాలేంటి? ఆమెను వెంటాడుతున్న వ్యక్తులెవరు? బటర్‌ఫ్లై అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ‘‘ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అరవింద్‌ షారోన్‌, గిడోన్‌ కట్టా, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని