పాయల్‌ ఆరోపణలు నిరాధారమైనవి: అనురాగ్‌

అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నటి పాయల్‌ ఘోష్‌ చేసిన ఆరోపణలపై సదరు దర్శకుడు స్పందించారు. పాయల్‌ చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. పాయల్‌ వ్యాఖ్యలతో చాలా మంది నుంచి తనకి ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా.. ఆమె ఆరోపణలపై స్పందించవద్దని...

Published : 20 Sep 2020 12:34 IST

నన్ను సైలెంట్‌ చేసేందుకే ఇలాంటి ఆరోపణలు: దర్శకుడు

ముంబయి: నటి పాయల్‌ ఘోష్‌ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ స్పందించారు. పాయల్‌ చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ఆమె వ్యాఖ్యలతో చాలా మంది నుంచి తనకి ఫోన్‌కాల్స్‌, మెస్సేజ్‌లు వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా.. ఆమె ఆరోపణలపై స్పందించవద్దని తన స్నేహితులు చెప్పినప్పటికీ సదరు నటికి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చానన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ వేదికగా పలు ట్వీట్లు పెట్టారు.

‘వావ్‌.. నన్ను సైలెంట్‌ చేసేందుకు మీరు(పాయల్‌ని ఉద్దేశిస్తూ) చాలా సమయం తీసుకున్నారు. ఒక మహిళ అయిన మీరు.. నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలున్నాయంటూ ఆరోపించడం తప్పుగా అనిపించలేదా? ప్రతిదానికీ కొన్ని హద్దులుంటాయి మేడమ్‌. మీరు ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పడానికి ఈ ట్వీట్లు చేస్తున్నా. నాపై ఆరోపణలు చేసే క్రమంలో బచ్చన్‌ కుటుంబాన్ని, పలువురు హీరోయిన్స్‌ని ఇందులోకి లాగడానికి ప్రయత్నించారు. కానీ పూర్తిగా విఫలమయ్యారు. మేడమ్‌.. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. అలా రెండు వివాహాలు చేసుకుని నేరం చేశానంటే చాలా సంతోషంగా ఒప్పుకుంటాను. దర్శకుడిగా ఎంతోమంది హీరోయిన్స్‌తో మాట్లాడుతుంటాను. కానీ, ఎప్పుడూ వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించలేదు. ఇకపై ఏం జరగనుందో మనం చూద్దాం. మీరు ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్లో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది’ అని అనురాగ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని