Ashokavanamlo Arjuna Kalyanam: ముహూర్తం కుదరలేదు

అర్జున్‌ కుమార్‌ పెళ్లికి మార్చి 4న పెట్టిన ముహూర్తం సరికాదని తీర్మానించినట్టు అల్లం వారి పెళ్లి బృందం స్పష్టం చేసింది. కొత్త ముహూర్తం ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఇవన్నీ

Updated : 03 Mar 2022 07:23 IST

అర్జున్‌ కుమార్‌ పెళ్లికి మార్చి 4న పెట్టిన ముహూర్తం సరికాదని తీర్మానించినట్టు అల్లం వారి పెళ్లి బృందం స్పష్టం చేసింది. కొత్త ముహూర్తం ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఇవన్నీ ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ సినిమాకి సంబంధించిన సంగతులే. విష్వక్‌సేన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రమిది. విద్యాసాగర్‌ చింతా దర్శకుడు. బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మిస్తున్నారు. ఈ నెల 4న విడుదల కావల్సిన ఈసినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం. ఆ మేరకు పెళ్లి పత్రిక తరహాలో ఓ ప్రకటనని విడుదల చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని