సల్మాన్‌ సినిమాలో మహిమా మాక్వాన

ఉయ్యాలా జంపాల’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన బొద్దుగుమ్మ అవికా గోర్‌. ఆమెను బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ సినిమా సినిమా ‘అంతిమ్‌’ నుంచి తీసేశారట. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌కు సోదరి పాత్రలో నటించేందుకు చిత్రబృందం అవికాగోర్‌ను సంప్రదించింది.

Published : 13 Dec 2020 23:55 IST

ముంబయి: ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన బొద్దుగుమ్మ అవికా గోర్‌. ఆమెను బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ప్రధానపాత్రలో నటిస్తోన్న సినిమా ‘అంతిమ్‌’ నుంచి తీసేశారట. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌కు సోదరి పాత్రలో నటించేందుకు చిత్రబృందం అవికాగోర్‌ను సంప్రదించింది. అందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపింది. చాలారోజుల తర్వాత బాలీవుడ్‌లో మళ్లీ సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉందని కూడా ఆమె పేర్కొంది. అయితే.. ఆ సినిమాలో అవికాకు బదులుగా టెలివిజన్‌ నటి మహిమా మాక్వానను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా డైరెక్టర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌ చెప్పారు. మరి.. ఇందుకు గల కారణాలతో పాటు ఈ విషయం అవికాకు తెలుసా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

తొలినాళ్లలో బొద్దుగా ఉండే అవికాగోర్‌.. కొంతకాలం సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకొని నాజుగ్గా మారి ఒక్కసారిగా అందరికీ షాక్‌ ఇచ్చింది. బాలనటిగా పలు హిందీ సీరియళ్లు, సినిమాల్లో నటించిన ఈ చిన్నారి పెళ్లికూతురు తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘లక్ష్మీరావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది3’ సినిమాల్లోనూ నటించింది. హిందీలో టెలివిజన్‌ ప్రేక్షకులను అలరిస్తోన్న మహిమా కూడా రెండు తెలుగు సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన ‘వెంకటాపురం’లో ఆమె కనిపించింది. అంతేకాదు.. మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లతో తెరకెక్కిన మోసగాళ్లు చిత్రంలోనూ ఆమె ఓ పాత్ర పోషించింది.

ఇదీ చదవండి..

కొన్నేళ్లపాటు ఆ ఆలోచనలతో బాధపడ్డా: అవికాగోర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు