కొన్నేళ్లపాటు ఆ ఆలోచనలతో బాధపడ్డా: అవికాగోర్‌

కొంతకాలం క్రితం నెగెటివ్‌ ఆలోచలతో తాను ఎంతగానో ఇబ్బందిపడ్డానని నటి అవికాగోర్‌ తెలిపారు. ఇటీవల నాజూగ్గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ.. ‘సెల్ఫ్‌ లవ్‌’కు సంబంధించిన సరికొత్త పోస్ట్‌తో ప్రతిఒక్కరీ హృదయాలను కొల్లగొట్టారు. భూమ్మీద ఉన్న ప్రతి వ్యక్తి.. ప్రతిరోజూ....

Updated : 01 Nov 2020 12:19 IST

హైదరాబాద్‌: కొంతకాలం క్రితం నెగెటివ్‌ ఆలోచనలతో తాను ఎంతగానో ఇబ్బందిపడ్డానని నటి అవికాగోర్‌ అన్నారు. ఇటీవల నాజూగ్గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ.. ‘సెల్ఫ్‌ లవ్‌’కు సంబంధించిన సరికొత్త పోస్ట్‌తో ప్రతిఒక్కరీ హృదయాలను కొల్లగొట్టారు. భూమ్మీద ఉన్న ప్రతి వ్యక్తి.. ప్రతిరోజూ తనతో తాను కొంత సమయాన్నైనా గడపాలని.. దానివల్ల జీవితం ఎంతో సంతోషంగా మారుతుందని, నెగెటివ్‌ ఆలోచనలు సైతం దరికి చేరవని పేర్కొన్నారు.

‘ఒంటరితనం వల్ల మీరు ఎప్పుడైనా భయపడ్డారా? మీ ఆలోచనలతో  మీరు కంగారుపడ్డారా? గతేడాది వరకూ.. ఈ ప్రపంచం, నా జీవితం గురించి తరచూ తప్పుగానే ఆలోచించేదాన్ని. చెడు ఆలోచనల నుంచి బయటపడడం కోసం నా చుట్టూ ఉన్నవారితో ఎక్కువ సమయాన్ని గడిపేదాన్ని. కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం ఉపయోగించాల్సిన విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాననిపించేది. నేను కూడా అందరిలా సాధారణ జీవితాన్ని గడపాలంటే నా చుట్టూ ఉన్నవాళ్లతో కాలాన్ని గడపాలని, లేకపోతే నెగెటివ్‌ ఆలోచనల వల్ల ఇబ్బందిపడాల్సి వస్తుందని భయపడేదాన్ని.’

‘అలా ఎన్నో సంవత్సరాలు ఇబ్బందిపడిన తర్వాత స్వీయ సంరక్షణ, వ్యక్తిగత ప్రేమ గురించి ఎంతో తెలుసుకున్నాను. ఆతర్వాత నుంచి నాతో నేను ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాను. డ్యాన్స్‌, వర్కౌట్లు, ఖాళీగా కూర్చొని నా ఆలోచలను కూడా ఎంజాయ్‌ చేయగలుగుతున్నాను. నెగెటివ్‌ ఆలోచనలతో వచ్చే భయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే అలాంటి ఆలోచనల వల్ల కొన్నేళ్లపాటు వేదన అనుభవించాను. కాబట్టి మీతో మీరు కొంత సమయాన్ని గడపండి. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇవేమీ లేకుండా మీ ఆలోచనలతో మీరు ఆ సమయాన్ని ఆస్వాదించండి’ అని అవికా గోర్‌ వివరించారు. ఆమె పెట్టిన పోస్ట్‌పై పలువరు నెటిజన్లు, సెలబ్రిటీలు స్పందించారు. ‘చాలా అద్భుతంగా చెప్పావు’ అంటూ కామెంట్లు పెట్టారు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్‌ అనంతరం పలు తెలుగు సినిమాల్లో నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు