విడాకుల వార్తలకు భూమిక చెక్‌..!

నటి భూమిక.. తన భర్త భరత్‌ నుంచి విడిపోయిందంటూ వస్తోన్న వార్తలకు సదరు నటి గట్టిగానే సమాధానమిచ్చారు. సెలబ్రిటీ యోగా టీచర్‌గా పేరుపొందిన భరత్‌ ఠాకూర్‌ను 2007లో భూమిక వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా భూమిక..

Published : 22 Oct 2020 13:22 IST

శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు

హైదరాబాద్‌: నటి భూమిక.. తన భర్త భరత్‌ నుంచి విడిపోయిందంటూ వస్తోన్న వార్తలకు సదరు నటి గట్టిగానే సమాధానమిచ్చారు. సెలబ్రిటీ యోగా టీచర్‌గా పేరుపొందిన భరత్‌ ఠాకూర్‌ను 2007లో భూమిక వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా భూమిక.. సోషల్‌మీడియాతోపాటు బయటకూడా సింగిల్‌గానే కనిపిస్తుండటంతో ఆమె.. తన భర్త నుంచి విడాకులు తీసుకుందంటూ ప్రచారం సాగింది.

కాగా, తాజాగా సదరు అవాస్తవ ప్రచారాలపై భూమిక పరోక్షంగా స్పందించారు. భరత్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసి.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘కొన్ని వేల మైళ్ల ప్రయాణం మొదలయ్యేది ‘ప్రేమ’ అనే ఒక్క అడుగుతో. ఈ ప్రేమ ప్రయాణంలోనే పరస్పరం అర్థం చేసుకోవడం.. ఒకరి నుంచి మరొకరు ఎన్నో విషయాలు నేర్చుకోవడం.. ముఖ్యంగా మనల్ని మనం, పరస్పరం తెలుసుకోవడం జరుగుతాయి. జీవితంలో నాకెంతో సంతోషాన్ని అందించిన నీకు కృతజ్ఞతలు. మనల్ని, మన ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. పనిపట్ల నీకున్న నిబద్ధతకు నేనెంతో గర్వపడుతున్నా. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని భూమిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌ చూసి పలువురు సెలబ్రిటీలు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని