Cinema News: ‘ఆదిపురుష్‌’ తేదీకి ‘లాల్‌ సింగ్‌’

కరోనా తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకూ విడుదల తేదీలను ప్రకటిస్తూ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Updated : 16 Feb 2022 08:58 IST

రోనా తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకూ విడుదల తేదీలను ప్రకటిస్తూ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇకపై నుంచి వరసగా సినిమాలు రానున్నాయి. పలువురు అగ్ర హీరోలు అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆమిర్‌ఖాన్‌ నిరాశపరిచే విషయాన్ని వెల్లడించారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’. దీన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ‘‘సినిమా పూర్తి కానీ కారణంగానే ఏప్రిల్‌ 14న విడుదల చేయడం లేదు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మా చిత్రం సందడి చేయనుంది. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ విడుదల తేదీని మార్చుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు’’అని ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్‌ ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. ‘లాల్‌సింగ్‌..’లో కరీనా కపూర్‌, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్‌ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది.

‘జెర్సీ’ ఏప్రిల్‌ 14న

మూడో దశ కరోనా ప్రభావంతో విడుదలల వాయిదా పర్వానికి తెరలేపిన ‘జెర్సీ’ ఎట్టకేలకు కొత్త తేదీని ఖరారు చేసుకుంది. షాహిద్‌కపూర్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించారు. దీన్ని ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు షాహిద్‌ మంగళవారం ప్రకటించారు. ‘మాకెంతో ఇష్టమైన జెర్సీని మీ ముందుకు ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నామని ప్రకటించడం ఆనందంగా ఉంది’’అని రాశారు షాహిద్‌. మృణాల్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఇదే పేరుతో తెలుగులో తెరకెక్కిన చిత్రంలో నాని హీరోగా నటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రం ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’లో నటించి షాహిద్‌ భారీ విజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని