ట్విటర్‌ నుంచి వైదొలగిన బ్రహ్మాజీ..!

నటుడు బ్రహ్మాజీ తాజాగా ట్విటర్‌ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో ఆయన అకౌంట్‌ కోసం సెర్చ్ చేస్తే ఆ పేరుతో ఖాతా లేనట్లు చూపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా తన ఇంట్లోకి వరదనీరు చేరిందని పేర్కొంటూ ఇటీవల...

Updated : 21 Oct 2020 15:41 IST

ఆ ట్వీట్‌ తర్వాత ఏమై ఉంటుంది

హైదరాబాద్‌: నటుడు బ్రహ్మాజీ తాజాగా ట్విటర్‌ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో ఆయన అకౌంట్‌ కోసం సెర్చ్ చేస్తే ఆ పేరుతో ఖాతా లేనట్లు చూపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా తన ఇంట్లోకి వరదనీరు చేరిందని పేర్కొంటూ ఇటీవల ఆయన ట్వీట్‌ చేశారు.

 ‘మోటర్‌ బోట్‌ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి’ అంటూ ఆయన చేసిన ఓ ట్వీట్‌ పలు విమర్శలకు దారి తీసింది. వర్షాల కారణంగా అందరూ ఇబ్బందులు పడుతుంటే వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తారా? అని పేర్కొంటూ ఆయన్ను నెటిజన్లు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన.. తన ట్విటర్‌ ఖాతాని డియాక్టివేట్‌ చేసినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఆయన 2011లో ట్విటర్‌ వేదికగా అభిమానులకు చేరువయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని