‘ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ..’

‘ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ.. న్యాయం జరగాలి..’ అంటున్నారు కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన నటిస్తున్న 57వ సినిమా ‘నాంది’. విజయ్‌ కనక మేడల దర్శకత్వం వహిస్తు్న్నారు. ప్రియదర్శి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది......

Published : 07 Nov 2020 01:19 IST

ఆసక్తికరంగా అల్లరి నరేష్‌ ‘నాంది’ టీజర్

హైదరాబాద్‌: ‘ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ.. న్యాయం జరగాలి..’ అంటున్నారు కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన నటిస్తున్న 57వ సినిమా ‘నాంది’. విజయ్‌ కనక మేడల దర్శకత్వం వహిస్తు్న్నారు. ప్రియదర్శి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘బ్రీత్‌ ఆఫ్‌ నాంది’ అంటూ ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిధరమ్‌ తేజ్‌ దీన్ని విడుదల చేశారు. నరేష్‌ ఇందులో ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.

‘15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే కానీ.. మన దేశానికి స్వతంత్రం రాలేదు. 1300 మందికిపైగా ప్రాణాలు పోగొట్టుకుంటే కానీ ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు.. నా ప్రాణం పోయినా ఫర్వాలేదు. న్యాయం గెలవాలి, న్యాయమే గెలవాలి...’ అంటూ పోలీసుల అదుపులో ఉన్న నరేష్‌ అనడం సినిమాపై ఆసక్తిని పెంచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని