యాంకర్‌ రవిని ఇరకాటంలో పెట్టిన సుమ

‘వీళ్లలో ఎవరితో కలిసి యాంకరింగ్‌ చేసి తప్పు చేశాను’ అని అనుకున్నారు అంటూ యాంకర్‌ రవి ప్రశ్నించి ఇరకాటంలో

Published : 03 Nov 2020 11:00 IST

హైదరాబాద్‌: ‘వీళ్లలో ఎవరితో కలిసి యాంకరింగ్‌ చేసి తప్పు చేశాను’ అని అనుకున్నారు అంటూ యాంకర్‌ రవి ప్రశ్నించి ఇరకాటంలో పెట్టారు సుమ. మరి సుమ చెప్పిన ఆ రెండు పేర్లు ఎవరివి? రవి ఏ సమాధానం చెప్పాడు? తెలియాలంటే నవంబరు 7న ప్రసారమయ్యే ‘క్యాష్‌’ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

సుమ వ్యాఖ్యాతగా సందడిగా సాగే ఈ కార్యక్రమంలో భాను శ్రీ, యాంకర్‌ రవి, జబర్దస్త్‌ ‘కెవ్వు కార్తీక్‌’, వర్షిణలు వాళ్ల తల్లులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి పడిన బాధ గురించి ‘కెవ్వు కార్తీక్‌’ చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. ‘నా తల్లిదండ్రులు జన్మనిస్తే, నా కొడుకు నాకు పునర్జన్మనిచ్చాడు’ అంటూ కార్తీక్‌ తల్లి చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోమోను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని