Published : 20 Oct 2020 10:57 IST

తెలుగంతా ‘అర్జున్‌రెడ్డి’ చూసే నేర్చుకున్నా!

హైదరాబాద్‌: తనకు వచ్చిన తెలుగంతా విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చూసే నేర్చుకున్నానని ఒకప్పటి స్టార్‌ కథానాయిక కస్తూరి అన్నారు. సుమ వ్యాఖ్యాతగా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన కార్యక్రమం ‘క్యాష్‌’. ప్రతి శనివారం ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఎంతో మంది వేచి చూస్తుంటారు. రాబోయే ఎపిసోడ్‌లో కస్తూరి, శోభాశెట్టి, రజిత, మీనా కుమారిలు సందడి చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన వారితో కలిసి సుమ చేసిన సందడి అలరిస్తోంది. ఈ ఆసక్తికర ఎపిసోడ్‌ను చూడాలంటే అక్టోబరు 24వ తేదీ వరకూ వేచి ఉండాల్సిందే. అప్పటి వరకూ తాజా ప్రోమోను చూసి ఆనందించండి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని