క్లైమాక్స్‌ చూసి సెట్‌లో యాంకర్‌ కన్నీరు

సుహాస్‌, చాందిని చౌదరి, సునీల్‌ కీలక పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘కలర్‌ఫొటో’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌ చూసి నటి సుమ సెట్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌ దొరికినంత దోచుకో’. దీపావళి

Published : 08 Nov 2020 18:22 IST

చక్కర్లు కొడుతోన్న వీడియో..!

హైదరాబాద్‌: సుహాస్‌, చాందిని చౌదరి, సునీల్‌ కీలక పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘కలర్‌ఫోటో’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌ చూసి నటి సుమ సెట్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌’: దొరికినంత దోచుకో’. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘క్యాష్‌’ సెట్‌లో ‘కలర్‌ఫోటో’ చిత్రబృందం సందడి చేయనున్నారు. దర్శకుడు సందీప్‌ రాజ్‌తోపాటు హీరో హీరోయిన్స్‌.. ‘క్యాష్‌’ సెట్‌లో నవ్వులు పూయించనున్నారు.

షోలో భాగంగా సుహాస్‌, చాందిని.. తమ సినిమాలోని పాటకు డ్యాన్స్‌ చేశారు. అనంతరం ‘కలర్‌ఫోటో’ క్లైమాక్స్‌ సన్నివేశాన్ని ‘క్యాష్‌’ సెట్‌లో చేసి చూపించడంతో అక్కడే ఉన్న సుమ భావోద్వేగానికి గురయ్యారు. నవంబర్‌ 14న శనివారం రాత్రి ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆసక్తికర ప్రోమోను మీరూ చూసేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని