
Bheemla Nayak: పండగ ముందే వచ్చేసింది
లాలా భీమ్లా... అంటూ సందడి మొదలుపెట్టారు పవన్‌కల్యాణ్. ఆయన, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘లాలా.. భీమ్లా’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ఈ నెల 7న విడుదల చేస్తున్నారు. బుధవారం పాట ప్రోమోని ది సౌండ్ ఆఫ్ భీమ్లా పేరుతో విడుదల చేశారు. ‘నాగరాజు గారూ.. హార్టీ కంగ్రాచులేషన్స్ అండీ, మీకు దీపావళి పండగ ముందుగానే వచ్చేసిందండీ’ అంటూ పవన్‌కల్యాణ్ చేసిన సందడి ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్ సరసన నిత్యమేనన్, రానా సరసన సంయుక్త మేనన్ నటిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.