మాల్దీవుల్లో హాలీడే మామూలుగా ఉండదు..!

మాల్దీవులు.. పర్యాటకులకు భూతల స్వర్గధామంగా పేరుపొందిన ప్రదేశం. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..!

Published : 13 Nov 2020 17:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: మాల్దీవులు.. పర్యాటకులకు భూతల స్వర్గధామంగా పేరుపొందిన ప్రదేశం. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..! అందుకే.. ఎప్పుడూ బిజీగా ఉండే సినీతారలు కొంచెం విశ్రాంతి దొరికినా సరే మాల్దీవుల్లో వాలిపోతుంటారు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా.. వేసవి టూర్స్‌కి దూరంగా కొన్ని నెలలపాటు ఇంట్లోనే గడిపిన తారలందరూ ఇటీవల తమకిష్టమైన ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు.

అలా సినీతారలు చాలామంది తమకిష్టమైన వారితో మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్‌ చేశారు. ఇటీవల తన ప్రియుడు మథియాస్‌ బో తో తాప్సీ అక్కడ కాలక్షేపం చేశారు. తాజాగా నటి కాజల్‌ అగర్వాల్‌ తన భర్తతో మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు దిశాపటానీ తన బాయ్‌ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌తో.. కత్రినా కైఫ్‌ తన స్నేహితులతో.. వేదిక, ప్రణీత సైతం తమకిష్టమైన వారితో సేద తీరేందుకు మాల్దీవులు బెస్ట్‌ ప్లేస్‌గా ఎంచుకున్నారు. తమ టూర్‌కు సంబంధించిన అందమైన ఫొటోలను సెలబ్రిటీలు నెట్టింట్లో పోస్ట్‌ చేసి అనందాన్ని పొందుతుంటే.. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వావ్‌ వాట్‌ ఏ ప్లేస్‌’ అంటూ ఫిదా అవుతున్నారు. మరి సెలబ్రిటీలు షేర్‌ చేసిన వెకేషన్‌ పిక్స్‌ మీరూ ఓ సారి చూసేయండి.

కత్రినాకైఫ్‌

తాప్సీ

మెహరీన్‌

ప్రణీత

టైగర్‌ ష్రాఫ్‌

వేదిక

నేహా ధూపియా

దిశాపటానీ





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని