దీపావళి.. తారల ప్లాన్స్‌ ఇవే!

కరోనా వైరస్‌ కారణంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దీపావళి పండుగతోనైనా కొవిడ్‌-19 తగ్గుముఖం పట్టి సాధారణ జీవనశైలిలోకి వెళ్లాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి యేటా ప్రత్యేక పార్టీలను నిర్వహించే...

Published : 14 Nov 2020 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి‌ కారణంగా ప్రజల జీవితాల్లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దీపావళి పండుగతోనైనా కొవిడ్‌-19 తగ్గుముఖం పట్టి సాధారణ జీవనశైలిలోకి వెళ్లాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు దీపావళి పండుగను పురస్కరించుకుని ఏటా ప్రత్యేక పార్టీలను నిర్వహించే సెలబ్రిటీలు.. ఈ ఏడాది ఇంటికే పరిమితమై, కుటుంబ సభ్యులతోనే వేడుకలు జరుపుకుంటున్నారు. దివాళీ సెలబ్రేషన్స్‌ గురించి సెలబ్రిటీలు ఏమన్నారంటే..


‘ఈ దీపావళి నాకెంతో స్పెషల్‌. మా అమ్మ వృత్తిరీత్యా వైద్యురాలు కావడంతో లాక్‌డౌన్‌లో సైతం ప్రజల కోసం సేవలందిస్తూ మాకు దూరంగా దిల్లీలో ఉన్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత పండుగ సందర్భంగా అమ్మ ఇంటికి వస్తోంది. దీంతో ఈ దీపావళి మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం’

- మానుషీ చిల్లార్‌


‘ప్రియమైనవారితో ప్రేమానుబంధాలు మరింత మెరుగుపరుచుకోవడానికి పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రేమ, పాజిటివిటీని పంచడానికి పండుగలు తోడ్పడతాయి. నా భర్త, కుటుంబంతో ఈ ఏడాది వేడుకలు జరుపుకుంటాను. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని అనుకుంటున్నాను.’

- సోనమ్‌ కపూర్‌


‘కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏదో ఒకరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకాలని ఆశిస్తున్నా. ఈ ఏడాది ఇంట్లోనే లక్ష్మీ పూజ చేయాలనుకుంటున్నాను. అలాగే కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటున్నాను’

- దీపికా పదుకొణె


‘ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా కుటుంబంతో దీపావళి వేడుకలను జరుపుకోనున్నాం. సంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తాం’

- భాగ్యశ్రీ


‘యూఎస్‌ నుంచి ఇండియాకి వచ్చిన కొత్తలో దీపావళి నాడు టపాసులు కాల్చడానికి మా పిల్లలు ఎంతో ఆసక్తి కనబరిచేవారు. ప్రస్తుతం వాళ్లకి పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఏర్పడింది. దీంతో టపాసులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దివాళీ రోజున ఇంట్లోనే లక్ష్మీ పూజ చేసి సాయంత్రం ఇంటిని దీపాలతో అలంకరించడమంటే నాకెంతో ఇష్టం’

- మాధురీ దీక్షిత్‌


‘దీపావళి అంటేనే సెలబ్రేషన్స్‌. దివాళీ కోసం మా ఇంట్లో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా మిఠాయిలు తయారు చేస్తాం. ఇప్పటికే మా ఇంట్లో ఆంధ్రా స్పెషల్‌ పిండి వంటలు సిద్ధం చేశారు. అలాగే ధన త్రయోదశి రోజున చిన్న బంగారు ఆభరణమైనా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తా’

- మంచు లక్ష్మీ ప్రసన్న


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు