ప్రియుడితో నయన్‌.. జిమ్‌లో రకుల్‌ 

నటి నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోని విఘ్నేశ్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో చూసిన నెటిజన్లు వావ్‌....

Published : 14 Nov 2020 01:32 IST

నేటి సోషల్‌మీడియా సంగతులివే

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోని విఘ్నేశ్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో చూసిన నెటిజన్లు వావ్‌ అంటున్నారు.

* ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల.. తన భర్త రాజీవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్‌తో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ‘నా ప్రియమైన రాజా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వే నా బలం, సంతోషం. నీతో కలిసి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని సుమ పేర్కొన్నారు.

* నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జిమ్‌లో బిజీ బిజీగా వర్కౌట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సరైన కసరత్తులు చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

* నటి కంగనా రనౌత్‌ సోదరుడి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకగా జరిగింది. సోదరుడి పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని