చిరు.. త్వరగా కోలుకోండి

తాను కరోనా బారిన పడినట్లు అగ్రకథానాయకుడు చిరంజీవి అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చిరు వెల్లడించారు. దీంతో ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ....

Published : 09 Nov 2020 14:27 IST

సినీ ప్రముఖుల వరుస ట్వీట్లు

హైదరాబాద్‌: తాను కరోనా బారిన పడినట్లు అగ్రకథానాయకుడు చిరంజీవి అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చిరు వెల్లడించారు. దీంతో ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.

‘నీకోసం కాకుండా ఎదుటివారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం.. నీ చుట్టూ ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీ గొప్ప ఆలోచనలతో నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి. అన్నయ్య నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ - నాగబాబు

‘చిరు సర్‌. మీరు కరోనాని జయించి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ - నిఖిల్‌

‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి.’ - రవితేజ

‘చిరంజీవి సర్‌.. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యవంతులుగా తిరిగి రండి. హనుమంతుడి ఆశీస్సులు ఎప్పటికీ మీతో ఉంటాయి. మిమ్మల్ని మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ - దేవిశ్రీ ప్రసాద్‌

‘మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను సర్‌’ - నితిన్‌

‘మామయ్య.. మీరు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నాను’ - ఉపాసన

‘త్వరలో మీరు యథావిధిగా షూటింగులో పాల్గొంటారు.. కోట్లాదిమంది అభిమానుల ప్రార్థనలు మీతో ఉన్నాయి సర్’ - రామజోగయ్య శాస్త్రి









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని