అభిమాని కుమార్తె పెళ్లికి చిరు సాయం

అభిమానుల విషయంలో దాతృత్వంగా వ్యవహరిస్తుంటారు అగ్రకథానాయకుడు చిరంజీవి. అభిమానులపట్ల తనకున్న సహృదయాన్ని తాజాగా ఆయన మరోసారి చాటుకున్నారు. కుమార్తె పెళ్లి విషయంలో ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్న ఓ అభిమానికి...

Updated : 11 Dec 2020 12:40 IST

హైదరాబాద్‌: అభిమానుల విషయంలో దాతృత్వంగా వ్యవహరిస్తుంటారు అగ్రకథానాయకుడు చిరంజీవి. వారిపట్ల తనకున్న సహృదయాన్ని తాజాగా ఆయన మరోసారి చాటుకున్నారు. కుమార్తె పెళ్లి విషయంలో ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్న ఓ అభిమానికి చిరు రూ.లక్షను సాయంగా పంపించారు. మహబూబాబాద్‌కు చెందిన భువనగిరి శేఖర్‌ అనే వ్యక్తి 30 సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమాని. మెగాస్టార్‌కు సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని చిరుకి అత్యంత ఆత్మీయమైన అభిమానిగా మారాడు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన శేఖర్‌ మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల శేఖర్‌ కుమార్తె వివాహం నిశ్చయమైంది.  తన కుమార్తె పెళ్లి చేయడానికి శేఖర్‌ పడుతున్న ఆర్థిక ఇబ్బందులను మెగాస్టార్‌ యూత్‌ సభ్యులు చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన చిరు.. శేఖర్‌కు సాయం అందించారు. ఈ మేరకు చిరు బ్లడ్‌బ్యాంక్‌ సీఈవో స్వామినాయుడు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌.. శేఖర్‌ కుటుంబసభ్యుల్ని కలిసి రూ.లక్ష చెక్కును అందించారు. ‘‘చిరంజీవికి చిన్నప్పటి నుంచి నేను అభిమానిని. నా ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుని సాయం చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని శేఖర్‌ అన్నారు.

ఇవీ చదవండి
వారితో స్నేహం.. మీ జీవితమే మారిపోతుంది: పూరి

ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని