Clap: నిజాయితీగా తీసిన చిత్రం

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ జంటగా పృథ్వి ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘క్లాప్‌’. రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో విడుదల కానుంది.

Updated : 11 Mar 2022 13:24 IST

ది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ జంటగా పృథ్వి ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘క్లాప్‌’. రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా నిజాయితీగా తీసిన చిత్రమిది. ఇందులో నేను, ఆకాంక్ష ఇద్దరమూ స్పోర్ట్స్‌ పర్సన్స్‌గానే కనిపిస్తాం. మా ఇద్దరి ప్రయాణం మరొకరి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దిందనేదే ఇందులోని ప్రధాన అంశం. ఇళయరాజా రీరికార్డింగ్‌ సినిమాకు బలం’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నా’’ అంది నాయిక ఆకాంక్ష. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: ప్రవీణ్‌ కుమార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని