‘కలర్‌ ఫొటో’ రిలీజ్‌లో మార్పులు..!

‘నాలా నల్లగా ఉన్నవాడు మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనున్న ఫ్రెండ్సే ఎగతాళి చేస్తారు. ఒకడు బ్లాక్‌అండ్‌వైట్‌ అంటాడు. ఒకడు గులాబ్‌జామ్‌ రసగుళ్ల అంటాడు. ఒకడేమో ఆశకి హద్దుండాలి..  క్షమించండి అమ్మాయిల ముందు బూతులు మాట్లాడితే బాగోదు.’ అని అంటున్నారు ...

Published : 07 Oct 2020 15:59 IST

హైదరాబాద్‌: ‘నాలా నల్లగా ఉన్నవాడు మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనున్న ఫ్రెండ్సే ఎగతాళి చేస్తారు. ఒకడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటాడు. ఒకడు గులాబ్ ‌జామ్‌ రసగుళ్ల అంటాడు. ఒకడేమో ఆశకి హద్దుండాలి..  క్షమించండి అమ్మాయిల ముందు బూతులు మాట్లాడితే బాగోదు’ అని అంటున్నారు సుహాస్‌. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కలర్ ‌ఫొటో’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్‌ కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమాని ‘ఆహా’ వేదికగా  అక్టోబర్‌ 8న విడుదల చేయాలని మొదట భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల తేదీలో మార్పలు చేశారు. ఈ మేరకు అక్టోబర్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని