
రోజా టీమ్‌కు కొరియోగ్రాఫర్ బెదిరింపులు
భయమంటే ఏంటో చూపిస్తాం..
హైదరాబాద్: రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న ‘జబర్దస్త్’ టీమ్‌ని ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబాభాస్కర్ బెదిరించారు. డిసెంబర్ 31న అసలు భయమంటే ఏంటో చూపిస్తానన్నారు. అంతేకాకుండా ‘మీరంతా వేస్ట్‌రా’ అంటూ కామెంట్లు చేశారు. బాబా భాస్కర్ చేసిన కామెంట్లపై రోజా స్పందించారు. ‘భయమంటే ఏంటో మేం చూపిస్తాం’ అన్నారు. అసలు బాబాభాస్కర్ బెదిరింపులకు పాల్పడడానికి కారణం ఏమిటంటే..
డిసెంబర్ 31 వేడుకల్లో భాగంగా ఈటీవీలో ‘డీజే 2021’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరగనున్న ఈవెంట్‌ని ‘ఢీ’ స్టేజ్‌పై చేయాలని భావించిన ‘జబర్దస్త్’ టీమ్.. సదరు డ్యాన్స్ షో సెట్‌లోకి అడుగుపెట్టింది. అయితే శేఖర్ మాస్టర్ ‘నో’ అనడంతో.. ‘ఢీ’ కంటెస్టెంట్స్ అందర్నీ కిడ్నాప్ చేసి ఓ చోట బంధించామని.. స్టేజ్ ఇవ్వకపోతే ఊరుకోమని ‘జబర్దస్త్’ కమెడియన్లు బెదిరించారు.
‘ఢీ’కి సపోర్ట్ చేస్తూ బాబాభాస్కర్ మాస్టర్ ఓ స్పెషల్ వీడియోని రూపొందించి ‘జబర్దస్త్’ టీమ్‌కి పంపించారు. ‘శేఖర్ అమాయకుడని.. ఢీ స్టేజ్‌పైకి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారా. మీరు వేస్ట్ రా. మా వాళ్లని వదలాలి. లేకపోతే డిసెంబర్ 31 రాత్రి అసలు భయమేంటో చూపిస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన స్పెషల్ ప్రోమో ప్రస్తుతం వీక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. ‘డీజే’ ప్రోమో మీరూ చూసేయండి.
ఇవీ చదవండి
నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..!
ఒక్కపైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్..?
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.