Dasara: ‘దసరా’ ప్రయాణం మొదలు

‘శ్యామ్‌ సింగరాయ్‌’తో  విజయాన్ని అందుకున్న కథానాయకుడు నాని... కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తిసురేష్‌ కథానాయిక. శ్రీ

Updated : 17 Feb 2022 09:11 IST

‘శ్యామ్‌ సింగరాయ్‌’తో  విజయాన్ని అందుకున్న కథానాయకుడు నాని... కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తిసురేష్‌ కథానాయిక. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు సుకుమార్‌, తిరుమల కిషోర్‌, వేణు ఉడుగుల, శరత్‌ మండవ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నాని, కీర్తిసురేష్‌ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు శ్రీకాంత్‌ తండ్రి చంద్రయ్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. కుటుంబ డ్రామాగా రూపొందుతోంది. నాని యాక్షన్‌తో కూడిన పాత్రని పోషిస్తున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వాహబ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్‌ నూలి,  ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌ చాగంటి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని