
ఆసక్తికరంగా ‘ఢీ-కింగ్స్ VS క్వీన్స్’..!
హైదరాబాద్: దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’. ఈటీవీ వేదికగా పన్నెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ‘ఢీ కింగ్స్ V/S క్వీన్స్ (సీజన్ 13) పేరుతో ప్రేక్షకులను ఎంతగానో అలరించనుంది. ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో న్యాయనిర్ణేతలుగా శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి.. టీమ్ లీడర్లుగా సుధీర్, రష్మి, ఆది వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌లో వర్షిణి లేనట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అదరగొట్టే డ్యాన్స్‌లతో అబ్బాయిలు (కింగ్స్), ఉర్రూతలూగించే స్టెప్పులతో అమ్మాయిలు (క్వీన్స్) ఈ సీజన్ 13లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్‌లోకెల్లా ఈ కింగ్స్ V/S క్వీన్స్ సీజన్ మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. మరీ ఈ డ్యాన్స్ సమరాన్ని వీక్షించాలంటే వచ్చే బుధవారం (డిసెంబర్ 16)న ప్రసారం కానున్న ‘ఢీ కింగ్స్ V/S క్వీన్స్’ చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను తిలకించండి..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.